- సరిహద్దులో ఉద్రిక్తతలను నివారించేందుకు చర్చలు
న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని వివాదాస్పద సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను తగ్గించి, సైనికుల మధ్య ఘర్షణలను నివారించేందుకు భారత్, చైనాలు తాజాగా మరో విడత ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిపాయి. నాగాలాండ్‌లోని దిమాపూర్ కేంద్రంగా పనిచేసే భారత సైన్యానికి చెందిన 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియా భారత బృందానికి నాయకత్వం వహించారు.
భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఈ భేటీలో పాల్గొన్నారు. గస్తీ దళాల మధ్య ఘర్షణలను నివారించేందుకు స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందించడం, సమాచార మార్పిడిని నిరంతరం కొనసాగించడం, స్థానిక వివాదాలు భారీ సైనిక ప్రతిష్టంభనకు దారితీయకుండా అడ్డుకోవడంపై ఈ చర్చల్లో దృష్టి సారించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు ప్రాంతాల్లో ఇరు దేశాల దళాలు ఎదురుపడుతుండటంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాలు భారీగా బలగాలను మోహరించగా, రాబోయే తీవ్రమైన చలికాలం ఈ పర్వత ప్రాంతంలో సైనిక కార్యకలాపాలకు మరిన్ని సవాళ్లను విసరనుంది.
